calender_icon.png 30 March, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను చేతల్లో చూపించాం

27-03-2025 01:57:51 AM

  1. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు 
  2. నాడు మాటల ఫ్రెండ్లీ పోలీసు.. నేడు చేతల ఫ్రెండ్లీ పోలీసు
  3. అసెంబ్లీలో శాంతిభద్రతలపై చర్చలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి) : శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మాటలు చెబితే.. తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏమిటో చేతల్లో చూపించామన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం శాంతిభద్రతల అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు చర్చించారు.

మతపరమైన ఉద్రిక్త పరిస్థితులకు తెలంగాణలో అవకాశం లేదన్నారు. సైబర్‌క్రైమ్ పోలీసులు రూ. 185 కోట్లు బాధితులకు తిరిగి అందించారని.. ఇం త పెద్ద మొత్తంలో నిందితుల నుంచి ఎప్పు డూ రికవరీ చేయలేదన్నారు. మంథనిలో న్యాయవా ద దంపతుల మర్డర్ జరిగితే.. ఈ ఘటనలో పోలీసులు వ్యవహారించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్‌లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని, డ్రగ్స్ నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన టీజీ న్యాబ్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుం డా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ఏఐ ఆధారిత ట్రాఫిక్ మానిటరింగ్ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

అదనపు సిబ్బందితో గూగుల్ మ్యాప్ ఉపయో గించుకుని ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు చర్యలు తీసుకుంటునట్టు స్పష్టం చేశారు. టీ టీమ్స్, భరోసా కేంద్రాలను మరింత పటిష్టం చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. 

అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండా

మున్సిపల్ సవరణ బిల్లు పంచాయతీరాజ్ సవరణ  బిల్లుకు శాసన మండలి బుధవారం ఆమోదం తెలిపింది. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీల వల్ల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లకు అవకా శం పోతుందని తీన్మార్ మల్లన్న అడిగిన ప్ర శ్నకు శ్రీధర్‌బాబు సమాధానం చెప్పారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా మున్సిపాలిటీలను ఏర్పా టు చేసిన ట్టు పేర్కొన్నారు. ప్రొటోకాల్ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

పాత చరిత్ర వద్దు...

సభలో బీఆర్‌ఎస్ సభ్యులు ప్రస్తుతం ప్ర వేశపెట్టిన అంశాలపైనే మాట్లాడాలని మం త్రి శ్రీధర్‌బాబు సూచించారు. ఎమ్మెల్యే ప ల్లా రాజేశ్వర్‌రెడ్డి హోంశాఖ, ఇరిగేషన్, సివి ల్ సప్లు, రెవెన్యూ అంశాలపై మాట్లాడుతూ గత పదేళ్లలో చేసిన అభివృద్ధి గురిం చి ప్రస్తావిస్తుండగా శ్రీధర్‌బాబు జోక్యం చేసుకొని పాత అంశాలపై చర్చ వద్దని సూ చించారు. పల్లా మాట్లాడుతూ డయల్ 100 రెస్పాన్స్ గతంలో కంటే తగ్గిందని, క్రైమ్ రేటు పెరిగిందని, ఎంఎంటీఎస్ లో అత్యాచార ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.