calender_icon.png 10 January, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు నోటీసులిచ్చాకే కూల్చేశాం

02-01-2025 03:09:43 AM

ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కమిషనర్ వివరణ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): ఖాజాగూడ నానక్   ప్రధాన మార్గానికి ఇరువైపులా ఉన్న తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణల విషయంలో ముందస్తు సమాచారంతో పాటు నోటీసులిచ్చిన తర్వా తే కూల్చివేతలు చేపట్టినట్టు హైడ్రా కమిషర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఖాజాగూడ చెరువు శిఖం పట్టాదార్లు కూడా బఫర్ జోన్ లో దుకాణాలు నడుపుతూ భగీరథమ్మ సరస్సును ఆక్రమించేందుకే నిర్మాణ శిథిలాలతో చెరువును నింపుతున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తౌతానికుంట, భరీరథమ్మ చెరువుల ఆక్రమణల కూల్చివేతల అనంతరం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయడంతో కూల్చివేతల వివరాల ను హైడ్రా కమిషనర్ బుధవారం వివరించారు. ఈ చెరువుల ఆక్రమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు.

అదే సమయంలో భగీరథమ్మ సరస్సులోకి నిర్మా ణ సామగ్రిని డంప్ చేస్తున్న టిప్పర్లను హైడ్రా బృందాలు పట్టుకోవడమే కాకుండా, అందుకు కారణమైన ‘సంధ్యా కన్‌స్ట్రక్షన్స్’ యజమాని శ్రీధర్‌రావుతో పాటు ఇతరులపై క్రిమినల్ కేసు నమోదైందన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ విభజనపై 8 ఏళ్ల క్రితమే తౌతానికుంటకు తుది నోటిఫికేషన్, భగీరథమ్మ చెరువుకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయన్నారు.

ఈ విషయాన్ని డిసెంబర్ 12న జరిగిన సమావేశంలో అక్క డి వాణిజ్య దుకాణాలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, శిఖం పట్టాదార్లకు స్పష్టంగా వివరించిచామన్నారు. ఈ సమావేశానికి ఆక్రమణకు గురైన 7 ఎకరాల భూమిని తీసుకున్న ఏస్ కంపెనీ ప్రతినిధులు సైతం వచ్చారన్నారు. ఆక్రమణలను ఖాళీ చేయాలని డిసెంబర్ 30న 24 గంటల సమయమిస్తూ నోటీసులిచ్చినా ఖాళీ చేయకపోవడంతో డిసెంబర్ 31 ఆక్రమణలను తొలగించినట్టు రంగనాథ్ తెలిపారు.