బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధి ద్వారా ప్రస్తుతం రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.6 వేల అందుతున్నదని, ఆ మొత్తాన్ని పెంచాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రతిపాదన ఇప్ప టికే చర్చల్లోనే ఉందని, కేంద్రం ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రకటించిందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు.