calender_icon.png 6 February, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనతో చరిత్ర సృష్టించాం

06-02-2025 12:22:12 AM

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): దేశ చరిత్రలో మొదటి సారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని, గత ప్రభుత్వం సకలజనుల సర్వే పేరిట బోగస్‌ఓట్లను పరిగణలోకి తీసుకొని బీసీల శాతాన్ని పెంచిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా బీసీ కులగణన సర్వే చేపట్టిందని దీన్ని  జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు.

బీసీలను తప్పుదోవ పట్టించేందుకు  ప్రయత్నిస్తున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.బుధవారం  పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్య ,రాజకీయ రంగాలలో బీసీలకు తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్న  సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బీసీలకు పూర్తి అన్యాయం జరిగిందని,కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీగా తగిన గౌరవాన్ని అందుకున్న తీన్మార్ మల్లన్న.

కులగణన విషయంలో మాట్లాడిన మాటలు అర్ధరహితమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన దొంగ సర్వే గురించి తెలిసి కూడా అవకాశవాదంతో మాట్లాడడం సరికాదు అన్నారు.

ఈ సమావేశంలో బీసీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, ఓబిసి సెల్ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్, బాలరాజు గౌడ్, అందే మోహన్, రాయికల్ శ్రీనివాస్, నల్లమోని శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, దేవగిరి నవీన్, సీతారాం, బస్వం, సురేష్, మాధవులు, గంగమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.