calender_icon.png 24 April, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడిని ఖండిస్తున్నాం

24-04-2025 12:13:37 AM

ఉగ్రమూలాలను అంతం చేస్తేనే దేశానికి, పౌరులకు రక్షణ

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పెహల్గాంలో పౌరసమాజంపై ఉగ్రవాదుల దాడి అమానుశమని, ఈ దాడిని, హత్యాకాండను కండిస్తున్నామని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సబీర్ పాషా అన్నారు. పెహెల్గం ఉగ్రదాడిపై వారు స్పందిస్తూ ఈ విధమైన దాడులు హత్యాకాండ, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం బాధాకరమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిం ఉంచాలని, ఉగ్రవాదాన్ని తుద ముట్టించి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు.

ఉగ్రము మూలాలను అంతం చేస్తేనే దేశానికి దేశ పౌరులకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. దేశ ప్రజల ప్రాణబద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అమాయక ప్రజలను చంపడం ద్వారా ఉగ్రవాదులు సాధించేది ఏంటని ప్రశ్నించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి వారు సంతాపం ప్రకటించారు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.