calender_icon.png 15 November, 2024 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నాం

15-11-2024 12:46:34 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): వికారాబాద్ కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం అవివేకమని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ.. అవినీతి ఎక్కడ జరిగినా, ఏ పార్టీ చేసినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని తెలిపారు. తాము కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, కానీ సీఎం విచారణ కోరారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైకోర్టుకు వెళ్లామని, ఈ కేసును కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.