03-04-2025 12:00:00 AM
ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్
అబ్దుల్లాపూర్‌మెట్, ఏఫ్రిల్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుండె శివకుమార్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ అబ్దుల్లాపూర్‌మెట్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుండె శివకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
యూనివర్సిటీ భూములను వేలం వెయ్యేదని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసి... అరెస్టు చేయడమేంటన్నారు. విద్యార్థుల అరెస్టులను ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ అండగా ఉంటుందన్నారు. విద్యార్థులకు మద్దతుగా ఛలో సెక్రెటేరియట్ ముట్టడికి సిద్దమేని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాగేష్, శశాంక్, నితిన్, మారుతి తదితరులు పాల్గొన్నారు.