05-04-2025 12:55:12 AM
ప్రకటించిన బీ.స్మాట్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థులకు జీపీఏ పద్ధతిని రద్దు చేస్తూ జీవో జారిచేయడాన్ని బీ.స్మాట్ (బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్) ఖండించింది. 2024--25 విద్యాసం వత్సర ప్రారంభం నుంచి పదో తరగతి విద్యార్థులకు జీపీఏ పద్ధతి ద్వారా విద్యా బోధన జరిగింది.
కానీ ప్రభుత్వం విద్యా సం వత్సరం చివరలో జీపీఏను రద్దు చేస్తూ జీ వో జారిచేడం తగదని బీ.స్మాట్ సంఘం అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి జే శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ విధా నం కార్పొరేట్ స్కూళ్లకే లాభం చేకూరుస్తుందన్నారు. మార్కుల విధానాన్ని రద్దు చేసి, జీపీఏ పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.