బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్...
లక్షేట్టిపేట (విజయక్రాంతి): న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడికొప్పుల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని స్థానిక న్యాయస్థానం ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ... హనుమకొండలో న్యాయవాది గంధం శివతో అమర్యాదగా, అనుచితంగా ప్రవర్తించి చేయి చేసుకున్న ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి బృందం తీరుపై మండిపడ్డారు. స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ చర్యకు పాల్పడిన సంబంధిత పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఈ నిరసనలో న్యాయవాదులు రాజేశ్వర్ రావు, కొమిరెడ్డి సత్తన్న, భూమా రెడ్డి, నరేందుల సురేందర్, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, ప్రదీప్, నేరెళ్ల రాజేశ్వర్, లక్ష్మీ రాజం, ఉమా రాణి, సంధ్య రాణి, కూడేల్లి అశోక్, తాజోద్దీన్, రెడ్డిమల్ల ప్రకాశం, గణేష్ పాల్గొన్నారు.