21-03-2025 12:44:13 AM
తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ జీటి.జీవన్
ముషీరాబాద్, మార్చి 20: (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నామని 89 సంస్థలకు సంస్థలకు సంబందించిన తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ జీ టి. జీవన్ అన్నారు.
ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ లోని ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఫైనాన్స్ అడ్వైజర్ గా ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్.సీ.కుమార్ ను తక్షణమే విధుల్లోంచి తొలగించాలని డి మాండ్ చేశారు. లేనిపక్షంలో మహా ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
అతని స్థానంలో కార్పొరేషన్ కు సంబంధించిన రెగ్యులర్ ఎంప్లాయి కి ప్రమోషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్.సీ.కుమార్ తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హెడ్ ఆఫీస్‌లో పని చేసే ఒక మహిళ ఉద్యోగిని బదిలీ చేశాడ న్నారు. అత ని బేసిక్ పేమెంట్ కంటే ఎక్కువగా రూ.2.50 లక్షల జీతం తీసుకుంటున్నాడని ఆరోపించారు.
రెగ్యులర్ ఎంప్లాయిస్ కు రావలసిన బకాయిలను రాకుండా చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అతనికి సంబంధించిన వారికి మాత్రమే పెద్దపీట వేస్తూ మిగతా వారికి అన్యాయం చేస్తున్నాడని అన్నారు. సుప్రసన్నకు అక్రమ డిపిసి అప్రూవల్ చేయించి ప్రమోషన్లు కల్పించారని ఆరోపించారు.
ఈ విషయంపై గవర్నర్ , డిప్యూటీ సీఎం, రాష్ట్ర డీజీపీ , హోం సెక్రటరీ , సీఎస్ లను కలసి వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రావాళ్లకు అక్రమంగా ఔట్సో ర్సింగ్ కింద అపాయింట్మెంట్ ఇస్తున్నాడని ఆరోపించారు. ఉద్యోగుల డిఏ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని, అడుగుతే దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ప్రభు త్వం ఇతనిపై ప్రభుత్వం వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.