calender_icon.png 4 April, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగుళం భూమినైనా తీసుకుంటలేం

04-04-2025 01:40:16 AM

అధికారంలోకొస్తే హెచ్‌సీయూ భూములను రక్షిస్తామంటున్న బీఆర్‌ఎస్ లీడర్ల వ్యాఖ్యలు హాస్యాస్పదం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు  

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): అధికారంలోకి వస్తే హెచ్‌సీయూ భూములను కాపాడతామంటూ బీఆర్‌ఎస్ నాయకు లు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమని ఐటీమంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఈ ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల జోలికి వె ళ్లడం లేదని, అంగుళం భూమినైనా ప్రభు త్వం తీసుకోవడం లేదన్నారు. హెచ్‌సీయూ కు సంబంధం లేని భూములపై విద్యార్థులను రెచ్చగొట్టడం సరికాదని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి హితవు పలికారు.

ఫేక్ ఫోటోలు, వీడియోలతో బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. పారిశ్రామిక అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలను పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగడం సరైంది కాదన్నారు. ‘ఫేక్ ప్రచారాలతో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా చేసే కుటిల కుట్రలను మానుకోవాలి.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరా లకు, హెచ్‌సీయూకు ఎలాంటి సంబంధం లేదు. ఆ భూమిపై సర్వహక్కులూ ప్రభుత్వానివే. ఈ మేరకు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేశాయి. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ఈ భూముల గురించి ఎందుకు నోరు మెదపలేదు. ఎందుకు పట్టించుకోలేదు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూము లను అప్పనంగా బినామీలకు కట్టబెట్టిన బీఆర్‌ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుం ది. మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి కంచ గచ్చిబౌలి భూములను వెనక్కు తీసుకుంటామని, ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామంటున్న ఈ నాయకులు గత పదేళ్లు అధికా రంలో ఉండి ఎందుకు పట్టించుకోలేదు. మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు’ అని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.  

4.28 లక్షల అటవీ భూమి మాయం 

పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో 4,28,437 ఎకరాల అటవీ భూమిని మాయం చేశారని, ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 7,829 ఎకరాల అటవీభూములను సేకరించారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసానికి ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. గతంలో వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగసభ కోసం వేలాది చెట్లను నేలకూల్చిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్‌కు విరుద్ధంగా 2016 నుంచి 2019 వరకు తెలంగాణలో 12,12,753 చెట్లను తొలిగించారని, ఇటీవల పార్లమెంట్‌లో ఒక ఎంపీకి ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.