22-02-2025 12:28:43 AM
తేల్చిచెప్పిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైం దంటూ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసులో దర్యాప్తును కొనసాగిం చేందుకు అనుమతించలేమని హైకోర్టు తే ల్చి చెప్పింది. దర్యాప్తును నిలిపివేస్తూ ఇ చ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయలేమని మరోసారి వెల్లడించింది.. ఈనెల 27 న మళ్లీ పూర్తిస్థాయిలో విచారిస్తామని స్ప ష్టం చేసింది. ఈ కేసులో నిందితులను కస్టడీ తీసుకుంటామని పోలీసులు కోరగా కోర్టు ఇటీవల తిర స్కరించింది.
పిటిషనర్ కాలంచేస్తే పిటిషన్ విచారణార్హం కాదు !
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై నాటి ప్రభుత్వ అవినీతి, అక్రమాలే కారణమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటిషనర్ నాగవెల్లి రాజలింగమూర్తి కాలం చేశారని, అందుకే ఇకపై ఆ పిటిషన్ విచారణార్హం కాదని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించింది.
అసలు ఫిర్యాదుదారే భౌతికంగా లేనప్పుడు ఇక విచారణ ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించింది. ఫిర్యాదుదారు లేకపోయినా విచారణ చేపట్టొచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) పల్లె నాగేశ్వరరావు ప్రస్తావించగా, కోర్టు కలుగజేసుకుని పిటిషన్ పూర్వాపరాల్లోకి వెళ్లొద్దని, ఫిర్యాదు ఎలా విచా రణార్హమో మాత్రమే చెప్పాలని పీపీకి సూచించింది.
అందుకు పీపీ స్పందిస్తూ.. బీఎన్‌ఎస్ సెక్షన్ 256 ప్రకారం ఫిర్యాదుదారు లేకపోయినా విచారణ జరపవచ్చని మరోసారి కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ అంశంపై తమ సహనాన్ని పరీక్షిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బరాజ్ కుంగు బాటుపై ఫిర్యాదు చేయాలనుకుంటే ఒక్క రా జలింగమూర్తే కాదని, 4 కోట్ల మందిలో ఏవరైనా ఫిర్యాదు చేయవచ్చని పే ర్కొన్నారు. అనంతరం పీపీ అభ్యర్థన మేరకు విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు.
కౌంటర్ దాఖలుకు ప్రతివాదికి నోటీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 నవంబర్ 27న బీఆర్‌ఎస్ నేత ముఠా గోపాల్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, ఆ కేసును కొట్టివేయాలని గోపాల్, కేటీఆర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
శుక్రవారం జస్టిస్ కె.లక్ష్మణ్ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ప్రతివాది, నాటి ఎస్సై ఆర్.ప్రేమ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేశారు.
పోలీసులకు హైకోర్టు నోటీసులు
మార్చి 18వ తేదీకి వాయిదా
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు చేశాననంటూ తనపై బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును కొ ట్టివేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై న్యాయస్థానం శుక్రవారం ఫిర్యాదుదారులైన పోలీసులతో పాటు కాంగ్రెస్ నేత బి.శ్రీనివా సరావుకు నోటీసులు జారీ చేసింది. కౌం టర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, పిటిషన్‌పై విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.