calender_icon.png 26 October, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో రౌండు ద్రవ్యోల్బణాన్ని భరించలేం

24-10-2024 12:00:00 AM

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్

ముంబై, అక్టోబర్ 23: ద్రవ్యోల్బ ణం మరోసారి ఎగిసేలా ఇండియా రిస్క్ చేయలేదని, కేంద్ర బ్యాంక్ లక్ష్యానికి లోబడి ద్రవ్యోల్బణం దిగి వచ్చేం తవరకూ ప్రస్తుత ద్రవ్య విధానాన్ని కొనసాగించడమే ఉత్తమ మార్గమని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల ప్రథమార్థంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను ఆర్బీఐ బుధవారం విడుదల చేసింది.

ఆ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టిన సంగతి తెలిసిందే. సమావేశపు మినిట్స్‌లో వెలువడిన వివరాల ప్రకారం ద్రవ్య విధానం ధరల స్థిరత్వాన్ని కొనసాగిస్తూ, వృద్ధికి దోహదపడేలా ఉండాలని, అందుచేత రెపో రేటును 6.50 శాతం వద్దే అట్టిపెట్టేందుకు పాలసీని ‘న్యూట్రల్’కు మార్చడానికి తాను ఓటు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ నియ మిత ఎంపీసీ సభ్యుడు నాగేశ్ కుమా ర్ మాత్రం 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) రేట్ల కోతను కోరుతూ ఓటు చేశారు. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని సాధారణస్థితికి తెచ్చే ప్రక్రియ ను మొదలుపెట్టాలన్నారు.