మహబూబ్ నగర్, జనవరి 6 (విజయ క్రాంతి) : మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం చేయవలసిన పనులు ఉంటే పరిష్కరించేందుకు మీ ఇంటికి వచ్చామని, ఎదురయ్యే సమస్యలను తెలియజేస్తే పరిష్కరిస్తామని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 20,21 వార్డులతో పాటు తదితర ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాసరెడ్డి సూచన మేరకు వార్డులను విజిట్ చేసి నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, సమస్యలు పరిష్కరించేందుకుగాను మీ ఇంటి కి వచ్చి అడుగుతు న్నామని వార్డు ప్రజలను కోరారు. మురుగు నీటి శుభ్రం చేయడంతో పాటు ప్రత్యేకంగా సిసి రోడ్ల నిర్మాణం తో పాటు అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోటూరు రాజు, మనీష్ గౌడ్, పాషా తదితరులు ఉన్నారు.