15-04-2025 12:00:00 AM
నడిగూడెం, ఏప్రిల్ 14 : రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్యం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు ఆందోళన పడొద్దని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ సుదీర్ అన్నారు.శుక్రవారం మండలంలోని కాగిత రామచంద్రా పురం పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడాతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర తో పాటు, క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సరిత,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, పిఎసిహె చైర్మన్ గోసుల రాజేష్, మాజీ సర్పం మంచికంటి వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్, రామిని విజయ వర్ధన్ రెడ్డి,దున్నా శ్రీనివాస్, బంధారాపు మల్లికార్జున్, పాతకోట్ల నాగేశ్వరరావు, విశ్వనాధ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు, సీఈవో, ఏఈ ఓ, రైతులు పాల్గొన్నారు.