calender_icon.png 18 November, 2024 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.2,851 కోట్ల ధాన్యం కొన్నాం

18-11-2024 02:48:53 AM

1,82,149 మంది రైతుల నుంచి సేకరించాం

గిట్టుబాటు ధర రావడమే అంతిమ లక్ష్యం

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

సూర్యాపేట, నవంబర్ 17 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,82,149 మం ది రైతుల నుంచి రూ.2,851 కోట్ల విలువ గల 1,48,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, 6,815 మంది రైతుల నుంచి రూ.1,206 కోట్ల విలువైన 1,64,191 టన్నుల పత్తిని కొనుగోలు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఆదివారం హైదారబాద్ వెళ్తున్న ఆయన సూర్యాపేట జిల్లా టేకుమట్ల వద్ద ఆగి ఐకేపీ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం రంగు మారకుండా ఉండేందుకే 17 శాతం తేమ నిబంధన పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో పండిం చే సన్నాలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాల వారు వచ్చి మంచి ధరను చెల్లించి కొనుగో లు చేస్తున్నారన్నారు. సోయా సేకరణలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్న దని చెప్పారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధరను సివిల్ సప్లు శాఖ చెల్లిస్తే, రూ.500 మాత్రం ఆర్థిక శాఖ ద్వారా చెల్లించనున్నట్లు తెలిపారు. నవంబర్ 3వ వారం నాటికి 48 శాతం అనగా 33 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తి అయ్యాయని, ఈ నెల చివరి నాటికి 21 శాతం అనగా 14 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తి అవు తాయని అంచనా చేసినట్లు తెలిపారు. రైతు లు వరి కొయ్యలు తగులపెట్టకుండా వ్యవ సాయ శాఖ తరఫున అవగాహన సదస్సులు నిర్వహించేలా ఆదేశాలిస్తామన్నారు. 

సత్తుపల్లిని మరువను

ఖమ్మం, నవంబర్ 17 (విజయక్రాంతి): తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన కు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి నియో జకవర్గ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరవనని, సత్తుపల్లికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండలం కారాయిగూ డెంలో ఆదివారం ఏర్పాటు చేసిన కమ్మ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమా నికి ఆయన హాజరై మాట్లాడారు. తన శ్వాస ఉన్నంతవరకు సత్తుపల్లి నియోజకవర్గాభి వృద్ధికి బద్దుడినై ఉంటానని అన్నారు.