calender_icon.png 21 September, 2024 | 5:36 AM

ఇండ్లలోకి నీరు వస్తుందని పేల్చేశాం!

21-09-2024 01:07:47 AM

  1. పోలీసులకు తెలిపిన నిందితులు..
  2. మత్తడి ధ్వంసం చేసిన నలుగురి అరెస్టు

మంచిర్యాల, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఈ నెల 16న మంచిర్యాల జిల్లా చె న్నూర్ మండల కేంద్రంలోని శనిగకుంట చె రువు మత్తడిని పేల్చివేతకు యత్నించిన నిం దితులను పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ శుక్రవారం చెన్నూర్ సీ ఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో అనుమానితుడు పెండ్యాల లక్ష్మీనా రాయణ ఇంటివద్దకు వెళ్లగా అక్కడ పెండ్యా ల లక్ష్మీనారాయణతో పాటు భీంమధుకర్, రాసమల్ల శ్రీనివాస్ ఉన్నారు. వారిని విచారించగా పేల్చింది తామేనని ఒప్పుకున్నారు.

పెండ్యాల లక్ష్మీనారాయణ భార్య స్వర్ణలత 11వ వార్డు కౌన్సిలర్. ఆ వార్డులో శనిగకుం ట చెరువు కింద కొన్ని ఇండ్లు ఉన్నాయి. వ ర్షాకాలంలో చెరువు నిండి ఇండ్లు ముంపునకు గురవుతున్నాయి. మహంకాళివాడ ను ంచి ఎన్‌హెచ్ 63కు ఎలాంటి కల్వర్టులు లేక, సీసీరోడ్లు నిర్మించడంతో చెరువు నీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండాపోయిం ది. చెరువు చుట్టూ 11.20 ఎకరాల భూమి పలువురి పేరిట ఉండగా ఇందులో మట్టి నింపడంతోనే ఇండ్లలోకి చెరువు నీరు రా వడం మొదలైంది. దీంతో లక్ష్మీనారాయణ తన స్నేహితులైన భీం మధుకర్, రాసమల్ల శ్రీనివాస్‌తో కలిసి చెరువు మత్తడి ఎత్తు తగ్గి ంచాలని ప్లాన్ చేశాడు.

దాని కోసం మంచిర్యాల ఏసీసీకి చెందిన గోగుల దానయ్యను సంప్రదించి, రూ.30 వేలకు మాట్లాడుకున్నారు. ఈ నెల 13న రాత్రి దానయ్య తన వ ద్ద ఉన్న కంప్రెషర్ డ్రిల్లర్ మిషన్‌తో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకెళ్లి మత్తడిని పగులగొట్టే ప్ర యత్నం చేయగా సాధ్యపడలేదు. నల్లగొండ లో తెలిసిన వారి వద్ద నుంచి బండ పగులగొట్టడానికి ఉపయోగించే పేలుడు పదార్థా లైన జిలెటిన్ స్టిక్స్‌తో ఈ నెల 16న మత్తడి గోడకు రంధ్రాలు చేసి జిలెటిన్‌స్టిక్స్‌కు బ్లాస్టి ంగ్ వైర్లు పెట్టి పేల్చారు.

దీంతో ఆ నలుగురి ని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. కేసును చేదించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూ ర్ సీఐ రవీందర్, ఎస్సై శ్వేత, కానిస్టేబుళ్లు టీ కయ్య, భూమన్న, అబ్దుల్‌ఖాదీర్‌లను అభిన ందించారు. దానయ్యను కిష్టంపేట శివారు వద్ద అదుపులోకి తీసుకుని కంప్రెషర్, డ్రిల్ మిషన్‌తో ఉన్న ట్రాక్టర్‌ను సీజ్ చేశారు.