calender_icon.png 28 September, 2024 | 8:46 AM

మేం డప్పు కొట్టం.. బొందలు తవ్వం

27-09-2024 12:05:03 AM

  1. దహన సంస్కారాలు బహిష్కరించిన దళితులు
  2. పనుల్లోకి రానియ్యని ఇతర కులస్థులు

ఖమ్మం, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి)/కూసుమంచి: నేటి డిజిటల్ యుగానికి తగినట్టుగా తమను తాము సంస్కరించుకోవాలని ఆ గ్రామ దళితులు సంకల్పించు కున్నారు. అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఇక ముందు గ్రామంలో ఎవ్వరు చనిపోయినా డప్పు కొట్టబోమని, బొందలు తవ్వమని, దహన సంస్కారాలు నిర్వహించబోమని తీర్మానించుకున్నారు. దీంతో గ్రామంలోని ఇతర కులస్థులు కోపంతో దళితులను పనుల్లోకి తీసుకోవడం మానేశారు. ఈ సంఘట న ఖమ్మం జిల్లా   నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మధ్యే గ్రామంలో ఒకరిద్దరు చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో వివాదం ఇంకా ముదిరింది.

దీంతో దళితులను వ్యవసాయ పనులతోపాటు ఇతర ఎలాంటి పనుల్లోకి తీసుకోవద్దని మిగిలిన కులాల వారు నిర్ణయించారు. దళితులు గురువారం నేలకొండ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ పూర్వీకులు, తాము ఈ వృత్తిని చేశామని, తమ పి ల్లలను పెద్ద చదువులు చదివించి, ప్రయోజకులను చేయాలని అనుకుం టున్నామని, అందుకే వృత్తికి దూరంగా ఉంటున్నామని తెలిపారు. కానీ గ్రామస్థులు తమను పనుల్లోకి రానివ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని  పేర్కొన్నా రు. కాగా ఖమ్మం రూరల్ ఏసీపీ పోలీస్టేషన్‌లో ఇరు వర్గాల మధ్య రాజీచేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.