14-02-2025 01:00:11 AM
జనగామ, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు కక్ష సాధింపు చర్యలకు దిగుతూ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందని, ఈ లెక్కలన్నీ తాము పింక్‌బుక్‌లో రాసుకుంటున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వ కవిత అన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి చెల్లిస్తామని ఆమె హెచ్చరించారు.
గురువారం జనగామ జిల్లాలో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై రైతులు నిలదీస్తారనే భయంతోనే రాహుల్‌గాంధీ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు.
సమ్మక్క-సారలమ్మ బరాజ్ పనులను తాము 90 శాతం పూర్తి చేశామన్నారు. కొసరు పనులను పూర్తిచేయలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు. దీనిపై కడియం శ్రీహరికి చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నిం సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కాలే యాదయ్య, కొమురవెల్లి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ సెవెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.