calender_icon.png 14 February, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం

14-02-2025 02:04:09 AM

  • ఏకకాలంలో రుణమాఫీ చేసింది మన ప్రభుత్వం 
  • మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : ఏకకాలంలో రుణమాఫీ చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతున్న ప్రభుత్వం మనదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం వేపూర్ గ్రామంలో రూ 50 లక్షల రూపాయలు తో రోడ్లు , డ్రైనేజీపనులకు, రూ 15 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న యాదవ కమ్యూనిటీ భవనానికి, కోటి యాభై లక్షల రూపాయలతో కిష్టంపల్లి నుంచి జూలపల్లి వరకు నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన,ఇబ్రహింబాద్ లో  5 లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధుల తో నిర్మించిన సిసి రోడ్డు ను, పట్టణంలోని ఈద్గాను ప్రత్యేకంగా పరిశీలించారు.

15.75 కోట్ల %ఊఏఓఈ్పు%  నిధులతో మహబూబ్ నగర్ పట్టణం లోని పలు వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క ప్రణాళికలతో ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్,  యాదవ రెడ్డి , నరసింహులు,  రఘు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా  గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.