13-02-2025 01:09:59 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ కంకణ బద్ధులమై పని చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అడ్డాకుల మండలం గుడిబండ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి, కందూర్ గ్రామంలో హై స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ రోడ్ల నిర్మాణానికి, పొన్నకల్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి, రాచాల గ్రామం లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో, పుల్కపల్లి గ్రామంలో సహ కార సంఘం ద్వారా ఏర్పాటుచేసిన గోదాంను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలను అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నామని పేర్కొన్నారు. డిసిసి బ్యాం కులో మొండిబకాయలకు 50% రాయితీ కల్పించి రైతులకు మేలు చేసేలా రుణ విముక్తులను చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి సంక్షేమ కోసం కృషి చేస్తు న్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసి సిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, శంకరాచారి, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.