calender_icon.png 23 January, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తున్నాం

22-01-2025 01:35:16 AM

  • సంక్షేమ పథకాలను చట్టాలుగా ఆమోదించడంలో తెలంగాణ అసెంబ్లీ రోల్ మాడల్ 

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 

పాట్నాలో 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్ రూపొందించిన చట్టాలు దేశం లో ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడుతున్నాయని, తద్వారా దేశ ప్రజల హక్కులు రక్షించబడుతున్నాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు.

ప్రధానంగా సమాచార హక్కు చట్టం, వస్తు సేవల పన్నులతోపాటు విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలలో పార్లమెంట్‌లో రూపొందించిన చట్టాలు పౌరుల కు ఉపయోపడుతున్నాయని చెప్పారు. బీహార్‌లోని పాట్నాలో జరుగుతున్న 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులతోపాటు అధికారులు హాజర య్యారు.

మంగళవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తికావడంతో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం, సమన్యాయం, సమానత్వం అనేవి ప్రాథమిక అంశాలుగా రూపొందించిన రాజ్యాం గం గత 75 ఏళ్లుగా ఈ దేశ ప్రజలకు మార్గదర్శనం చేస్తున్నదని తెలిపారు. భారత రాజ్యాంగ విలువలకు, మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ శాసనసభ పనిచేస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలకు అవ సరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో, వాటిని చట్టాలుగా ఆమోదిం చడంలో శాసన సభ ఒక మాడల్‌గా ఉన్నదని చెప్పారు. రైతుల భూ వివరాలకు ఉప యోగపడే భూ భారతి చట్టం, యువతకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వం టి చట్టాల రూపకల్పన ద్వారా తెలంగాణ శాసనసభ మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని సగర్వంగా చెప్పగల మని అన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే చట్టాల రూపకల్పనలో కృషి చేస్తున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ అభినందించారు. రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.