28-02-2025 12:00:00 AM
శ్రుతిహాసన్, డాఫ్నే ష్మోన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’తో గ్లోబల్ ఆడియెన్స్‌కు పరిచయం కాబోతోంది. దుబాయ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో ఈ అవకాశం దక్కనుంది. ఫిబ్రవరి 27న ప్రారంభమైన ఈ హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాల వేడుక మార్చి 2 వరకు జరగనుంది.
ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్‌గా ‘ది ఐ’ చిత్రం ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది. డయానా (శ్రుతిహాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం చేసే ప్రయాణమే ‘ది ఐ’. చనిపోయిన తన భర్తను మళ్లీ తిరిగి తీసుకు వచ్చేందుకు చేసే ప్రయత్నాలు ఎంతో ఆసక్తిగా ఉండబోతోన్నాయని టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో‘ది ఐ’ని ప్రదర్శించిన తర్వాత ప్రాజెక్ట్‌పై అందరిలోనూ మరింతగా ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. “సైకలాజికల్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి. మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం” అని అన్నారు. డాఫ్నే ష్మోన్ మాట్లాడుతూ.. “ఎమోషన్స్, సంఘర్షణ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించే డయానా పాత్రలో శ్రుతిహాసన్ చక్కగా నటించారు” అన్నారు.