12-02-2025 01:21:07 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి) : అక్రమంగా ఇసుక తరలించకండి... నిబంధనలు పాటించండి.. అనుమతులు తీసుకొని అవసరం మేరకు ఇసుక ఉపయో గించండి... అన్ని నిబంధనలు తెలుసుకొని అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిసి ఎవరు కూడా తప్పు చేయకూడదని జిల్లా ఎస్పీ డి జానకి హెచ్చ రించారు.
ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ ఇసుక సరఫరా జరగాలని అధిక ధరకు విక్రయించిన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక లావాదేవీలు జరిపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని స్పష్టం చేశారు.