-రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు
-ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వాన్నిదని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ, రూరల్ మండలంలోని, మల్లారం, నూకలమర్రి గ్రామంల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేములవాడ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన ఎరువుల గోదాం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం,అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు.
దేశానికి, ప్రపంచానికి అన్నాన్ని అందించే రైతన్నకు అండగా నిలవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని,రైతుల ద్వారా ఎన్నికైన ఫ్యాక్స్ సంఘాలు, సింగిల్ విండోలు రైతులకు సేవలను అందిస్తున్నాయన్నారు.గోదాంలో నిర్మాణాల వలన రైతులకు ఎరువులు అందుబాటులో ఉండడంతో పాటు, విత్తనాల నిల్వ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.జిల్లా కలెక్టర్ తో జరిగిన మొదటి సమావేశంలో ప్రతి గ్రామానికి ఎరువుల గోదాం నిర్మాణం చేయాలని ఆరోజు సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు.రైతులను రాజుగా చేయడం సంకల్పంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుందని,గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు.
దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులందరికీ ఏక కాలంలో రుణమాఫీ చేసామని,మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారన్నారు.సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ అర్హులైన రైతులకు మా ప్రభుత్వ అండగా ఉంటుందన్నారు.రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.అర్హులైన ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి డైరెక్టర్లు. కాంగ్రెస్ పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం. మాజీ సర్పంచులు ఎంపిటిసిలు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.