calender_icon.png 19 April, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి చర్చలకు మేము సిద్ధం

10-04-2025 01:34:56 AM

చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలని డిమాండ్ 

మావోయిస్టు నార్త్ -వెస్ట్ సబ్ జోనల్ కమిటీ లేఖ 

చర్ల ఏప్రిల్ 9 (విజయ క్రాంతి) శాంతియుత చర్చలకు తమ పార్టీ సిద్దంగా ఉందని, అందుకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని సిపిఐ ఎంఎల్ మావోయిస్టు నార్త్ వెస్ట్ జోనల్ కమిటీ రూపేష్ పేరుతో బుధవారం ఒక లేఖను విడుదల చేశారు. శాంతి చర్చల అంశం తమ పార్టీ సిసి/ఎస్ జె సి పరిధిలోని అంశమని, మీడియాలో వస్తున్న వార్తలను చూసి తక్షణమే స్పందించలేని పరిస్థితి ఉందన్నారు. చర్చల కోసం తమ పార్టీ సీసీ ఇచ్చిన ఆఫర్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగానే ఈ లేఖను చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. గతంలో తమ పార్టీ కేంద్ర కమిటీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని సానుకూల వాతావరణం అవసరమని అభ్యర్థించగా, చతిస్గడ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ తమ డిమాండ్ ను తిరస్కరించార ని గుర్తు చేశారు. శాంతి చర్చలు జరగాలంటే బస్తాల్లో జరుగుతున్న మారణ కాండను తక్షణమే నిలిపివేయాలని మరోసారి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామన్నారు.

ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రాగానే అందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తామని లేఖలో తెలిపారు. ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ లేవనెత్తిన మిగిలిన అంశాలను చర్చల ఎజెండాలో నిర్ణయించవచ్చనీ లేఖలో తెలిపారు. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని తమ డి మాండ్కు మద్దతుగా దేశంలోని ప్రజాస్వామ్య ప్రేమికులు, మే ధావులు, మానవ హక్కుల సంఘాలు, సామాజిక సంస్థలు కార్యకర్తలు, ప్రజాపక్ష పాత్రికేయులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను సమర్ధించుకోవడానికి కుట్టలో భాగంగా తాము అభి వృద్ధి వ్యతిరేకులుగా అంచనా వేస్తున్నారు.

బస్టాండ్ నుంచి ఇతర రాష్ట్రాలకు తమ నాయకత్వం పారిపోతుందన్న చర్చ సరి నాయకత్వం తమ బాధ్యతల పరిధిలో కదలికలు ఉద్యమ అవసరాలకు అనుగుణంగా బదిలీలు ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీలు, రేషన్ బాక్స్లు, తాగునీరు, విద్యుత్తు వంటి వాటికి తాము వ్యతిరేకలం కాదని స్పష్టం చేశారు.శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణ సృష్టించే దిశగా తమ పార్టీ కార్యకర్తలు ఉండాలని నార్త్ వెస్ట్ సబ్ జోన్ కమిటీలు, కమాండ్లు, కమాండర్ లను అభ్యర్థిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించలే దని కూడా గుర్తుంచుకోవాలన్నారు.

దాడులకు బాధితులుగా మారకండి మీడియా రెచ్చగొట్టే ప్రచారానికి పోలీసుల అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలకు ప్రభావితం కావొద్దన్నారు. ప్రభు త్వం నుంచి సానుకూల సంకేతాలు అందిన వెంటనే పూర్తి కాల్పుల విరమణ అమల్లోకి రానుంది. ప్రభుత్వ వైఖరిని బట్టి మరింత స్పష్టతతో నిర్ణయాలు తీసుకొని ప్రకటన జారీ చేస్తామన్నారు. తమ పార్టీ ఎప్పుడు పోలీస్ సిబ్బందిని శత్రువుగా చూడదని ఇప్పటికే పలుమార్లు  కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విజ్ఞప్తులు చేశామని, శాంతి చర్చల కోసం తాము చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని పోలీసు సిబ్బందికి లేఖద్వారా విజ్ఞప్తి చేశారు.