calender_icon.png 21 March, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతోషంలో మనది 118వ స్థానం

21-03-2025 12:04:20 AM

  • విడుదలైన ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’

మరోసారి తొలిస్థానంలో నిలిచిన ఫిన్లాండ్

న్యూఢిల్లీ, మార్చి 20: ప్రభుత్వాలెన్ని మారినా.. మన దేశస్తులు మాత్రం సంతోషంగా ఉండటం లేదు. తాజాగా విడుదలైన ‘వరల్డ్ హ్యపీనెస్ రిపోర్ట్’లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఈ జాబితాలో మన దేశం దాయాది పాకిస్తాన్ కంటే వెనుకబడిపోయింది. గతేడాది కంటే ఈ సారి మనకు మెరుగైన ర్యాంకు వచ్చినప్పటికీ ఆ ర్యాంకు ఎక్కడో ఉండటం గమనార్హం. ఈ రిపోర్ట్‌లో భారత్ 118వ ర్యాంకులో నిలిచింది.

కాగా మరోసారి కూడా ఫిన్లాండ్ దేశం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఫిన్లాండ్ ఈ రిపోర్టులో తొలిస్థానం లో నిలవడం ఇది వరుసగా ఎనిమిదోసారి. తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్ వంటి నార్డిక్ దేశాలు నిలిచాయి.

నార్డిక్ (నార్వే, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, డెన్మా ర్క్) దేశాలే మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి. భారత్ విషయానికి వస్తే ఈ రిపోర్టులో గతేడాదితో పోల్చితే ఎనిమిది స్థానాలు ఎగబాకినా కానీ 118వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిం ది. మన పొరుగుదేశాలైన చైనా (68), పాకిస్తాన్ (109) మనకంటే మెరుగైన స్థితిలో నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా 24వ స్థానంతో సరిపెట్టుకుంది.