11-12-2024 12:56:18 AM
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
మేడ్చల్, డిసెంబర్10: ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా వృత్తి విద్యాకోర్సులను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి డీ శ్రీధర్‌బాబు అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని కొండాపూర్‌లో హిందుస్థాన్ ఏరోనాటికల్ సహకారంతో 3 ఎకరాల్లో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన మహిళా గురుకుల ఐటీఐని మంగళవారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభ్యాసం పూర్తికాగానే ఉపాధి కల్పించడానికి పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. రాష్ట్రంలో 65 ఇన్‌స్టిట్యూట్‌లను ఆధునిక హంగులతో కొత్త భవనాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఘట్‌కేసర్‌లో ౫ ట్రేడ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
విద్యార్థులు సాంకేతికను అందిపుచ్చుకోవానల్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పావని యాదవ్ తదితరులు పాల్గొన్నారు.