జీపీల వికాసానికే పనుల జాతర
మంత్రి కొండా సురేఖహైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధనల కంటే.. పాలకుల స్వీయ నైతికతే దేశ భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన మాటలను తమ ప్రభుత్వం అంతఃకరణశుద్ధితో ఆచరిస్తోందని మంత్రి కొండా సురేఖ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగం రూపకల్ప నకు శ్రమించిన మేధావుల కృషిని మంత్రి స్మరించుకున్నారు.
భారత రాజ్యాంగానికి ఆమోదం లభించిన నవంబర్ 26 దేశ ప్రజలందరికీ ఎంతో ప్రత్యేకమైనదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల వికాసానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా రూ.2,750 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.