ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జనవరి 22 (విజయ క్రాంతి) : అభివృద్ధి కి బాటలు వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో రూ. 39.50 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు,ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ అభివృద్ధి కి కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్ విట్టల్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, హకీం , కౌన్సిలర్లు మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎంఇ బస్వరాజు, ఎఇ మహ్మద్ నస్రత్ తదితరులు పాల్గొన్నారు.