calender_icon.png 5 February, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తండేల్’కు మేం పోటీ కాదు

05-02-2025 12:24:46 AM

ఒక పథకం ప్రకారం హీరో సాయిరామ్ శంకర్ 

స్టార్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ తమ్ముడు, టాలీవుడ్ హీరో సాయిరామ్ శంకర్ నటించిన కొత్త సినిమా ‘ఒక పథకం ప్రకారం’. మలయాళ దర్శకుడు వినోద్‌కుమార్ విజయన్ దర్శకత్వం వహిస్తూ నిర్మాత గార్లపాటి రమేశ్‌తో కలిసి నిర్మించిన చిత్రమిది. శ్రుతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో సాయిరామ్ శంకర్ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.

ఫిబ్రవరి 7న సినిమా విడుదల కానున్న సందర్భంగా హీరో సాయి రాం శంకర్ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు.  ‘సినిమా చూశాక మా యూనిట్‌లో కీలక సభ్యులు ‘విలన్‌ను పట్టుకుంటే రూ.పది వేలు’ అని చెప్పడంతో దీన్నే ఫిక్స్ అయ్యాం.

సినిమా పేరు, రిలీజ్ విషయం తెలియడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఈ టైటిల్ ను సాధారణంగా 80 శాతం క్రైమ్ జోనర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుం ది. కాబట్టి ‘ఒక పథకం ప్రకారం’ అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం. మా అన్నయ్య పూరి జగన్నాథ్ ట్రైలర్ చూశారు.

కొత్తగా ఉందన్నారు. పట్టుకుంటే రూ.10 వేలు గురించి కూడా చెప్పాను. ఇందులో నా పాత్ర క్రిమినల్ లాయర్. నెమ్మదిగా నా క్యారెక్టర్‌లో ఒక్కో షేడ్ బయట పడుతుంది. క్రిమినలా లేకపోతే క్రిమినల్ లాయరా అనిపించేలా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నా పాత్ర కోసం నెల రోజులు ట్రైనింగ్, వర్క్ షాప్స్ కూడా చేశాను.

విజయన్ మలయాళ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు సినిమాలు, ఇక్కడి స్టుటైల్ బాగా ఇష్టం. ‘మలయాళంలో ఓ పాయింట్ పట్టుకుని వెళ్లిపోతారు. కానీ ఇక్క డ అలా కుదరదు, కష్టం’ అంటారాయన. కాబట్టి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఫైట్ సీన్స్, సాంగ్స్ డిజైన్ చేశారు. తమిళ ఫైట్ మాస్టర్ ఢిల్లీ బాబు ఫైట్స్ డిజైన్ చేశారు.

ది లవ్ స్టోరీ బేస్డ్ క్రైమ్ మూవీ. షూటింగ్ కోసం 25 డాగ్స్ తెచ్చాం. క్లుమైక్స్ సీక్వెన్స్ ఏకంగా 4 రోజులు చేశారు. ఆ టైమ్‌లో డాగ్ నాపైకి రావడంతో గ్రిల్ ఎక్కేశాను. లక్కీగా ఎస్కేప్ అయ్యాను. ఆ ఫైట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక క్లుమైక్స్ సీన్ తీసి, సరిపోవవడంలేదని మళ్లీ ఎక్టుసైండెడ్ వెర్షన్ తీశారు డైరెక్టర్.

ఏడెనిమిది రోజులు క్ల్లుమాక్స్ కోసమే షూటింగ్ చేశాం. ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మధ్యలో ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ, నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నారు.  పాత్ర నచ్చితే  ఎలాంటి రోల్ అయినా చేస్తాను. తెలుగు సినిమాల్లో హిందీ యాక్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు..

తెలుగు యాక్టర్స్ నటించడానికి ముందుకు రావట్లేదని అంటున్నారు. కానీ నేను ఆల్రెడీ ‘నేనింతే’లో చేశాను. నాకూ అవకాశాలు వచ్చాయి. కానీ చేయడం కుదరలేదు. గతం లో ఇలాంటి సస్పెన్స్ జోనర్ సిని మా, ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదు. వన్ మంత్ ట్రైనింగ్ తర్వాత రియలిస్టిక్‌గా చేశామన్న సంతృప్తి లభించింది.

ఇప్పటికైతే తెలుగులో మాత్రమే. తర్వాత ఇతర భాషల్లో ప్లాన్ చేస్తున్నా రు. కెమెరామెన్ రాజీవ్ ఇండియన్ టాప్ కెమెరా మెన్లలో ఒకరు. మలయాళంలో రెండు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించా రు.

తెలుగు కూడా నేర్చుకున్నారు. ‘తండేల్’కు మాకు పోటీ ఏముం ది? మేము దాంతోపాటుగా రిలీజ్ చేయట్లేదు. ‘తండేల్’ పక్కన రిలీజ్ చేస్తున్నాం. వెబ్ సిరీస్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. ఓ మైథలాజికల్ సిరీస్ చేస్తున్నాం. అందు లో 60 ఏళ్ల ఓల్డ్ రోల్ నాది. ఇప్పు డు చేస్తున్న సినిమాల లిస్ట్‌లో ‘రీసౌండ్’ ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి.