జియో స్మార్ట్ ఇండియా సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3(విజయక్రాంతి): నగరంలోని వరద ముప్పును అధిగమించేందుకు హైడ్రా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని.. అందులో భాగంగానే చెరువుల పునరుద్ధరణ, అనుసంధానంపై దృష్టి సారించిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హెచ్‌సీసీలో జరిగిన ‘జియో స్మార్ట్ ఇండియా.
సదస్సులో రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలతో పాటు ఇతర ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చెరువుల కొలతలు, లెక్కలను తేల్చే పనిలో హైడ్రా ఉందన్నారు.
జియో స్మార్ట్ ఇండియాతో.. ఇక్కడి నేల స్వభావం, వరదముప్పు ఉన్న ప్రాంతాల సమాచారం కరువుకాటకాలు తదితర అంశాలు తెలుసుకేనే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమాచారంతో ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందన్నారు. సదస్సు నిర్వాహకులను అభినందించారు.