calender_icon.png 1 November, 2024 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి కోల్పోతున్నాం

21-07-2024 01:22:37 AM

లక్నో, జూలై 20 : కన్వర్ యాత్ర చేపట్టే రూట్‌లో ఉన్న హోటళ్లు, తి నుబండారాల షాపులకు సంబంధించిన నేమ్‌ప్లేట్లపై యజమానుల పేర్లు , మొబైల్ నంబర్లు, అడ్రస్‌లు ప్రదర్శించాలని యూపీ సర్కార్ ఆదేశా లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ.. ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాలు పాటించాల్సిందేనని సీఎం యోగి స్పష్టం చేశారు. దీంతో కన్వర్ యాత్ర జరిగే మార్గంలోని వి విధ షాపుల యజమానులు ఈ రూల్‌ను కచ్చితంగా పాటిస్తున్నారు.

అయితే, గతంలో ఎంతో సందడిగా కనిపించే ముజఫర్ నగర్ రోడ్డు ఇప్పుడు జనం లేక కళావిహీనంగా మారింది. గిరాకీ బాగా తగ్గిందని, తమ పేర్లతో నంబర్ ప్లేట్ ప్రదర్శించడంతో ముస్లింలమని తెలిసి కస్టమర్లు రావ డం లేదని యజమానులు వాపోతున్నారు. రంజాన్, ఈద్ జరుపుకునే క్రమంలో దుకాణదారుడు హిందు వా లేదా ముస్లిమా అని ఎన్నడూ చూడం.. అటువంటిది కన్వర్ యాత్రలో ఇదేంటని చాలా మంది షాప్ యజమానులు ప్రశ్నిస్తున్నారు.