calender_icon.png 17 March, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరకోరా వేతనాలతో జీవితాలను వెల్లదీస్తున్నాం..

17-03-2025 05:13:10 PM

రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహసిల్దార్ కు సోమవారం ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని వినతి పత్రం సమర్పించారు. ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ... చాలా సంవత్సరాల నుండి అరకోర వేతనాలతో జీవితాలను వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా, రూ.18 వేలు నెలసరి వేతనం అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యలయంలో పెద్ద ఎత్తున ఆశలు పాల్గొన్నారు.