calender_icon.png 27 November, 2024 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ పౌరసత్వాన్ని పరిశీలిస్తున్నాం

27-11-2024 01:56:57 AM

కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

న్యూడిల్లీ, నవంబర్ 26: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వం అం శాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర ప్రభు త్వం అలహాబాద్ కోర్టుకు మంగళవారం తెలిపింది. రాహుల్ పౌరసత్వాన్ని రద్దు చే యాలంటూ బీజేపీ నేత విఘ్నేశ్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కేంద్ర ప్రభుత్వం తన అభిప్రా యాన్ని తెలపాలని కోరింది. అంతేకాకుండా ఈ కేసుపై విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. రాహుల్ గాంధీ కి బ్రిటిష్ పౌరసత్వం ఉందని విఘ్నేష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

యూకే ప్రభుత్వం పంపిన ఈమెయిళ్లను సా క్ష్యంగా చూపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా ఆయన కోర్టు ను కోరారు. ఇదే విషయంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అలహాబాద్ కోర్టులో విచారణ కొలిక్కి వచ్చిన తర్వా త విచారణ జరపనున్నట్టు తెలిపింది.