calender_icon.png 19 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో హౌసింగ్ పాలసీ తీసుకొస్తున్నాం

19-01-2025 12:29:11 AM

  1. మధ్య తరగతి ప్రజలకు గృహనిర్మాణం
  2. హిమాచల్‌ప్రదేశ్ మంత్రి రాజేశ్ ధర్మానితో భేటీలో మంత్రి పొంగులేటి

హైద్రాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

ఔటర్ రింగ్‌రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో మధ్యతరగతి ప్రజానీకం కోసం కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నామని, కనీ సం వంద ఎకరాల్లో ఈ టౌన్ షిప్‌లను నిర్మించి మధ్య తరగతి ప్రజానీకానికి అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివా లయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎస్‌హెచ్ రాజేశ్ ధర్మాని సమావేశమయ్యారు. తెలంగాణలో చేపడుతున్న గృహనిర్మాణ పథకాల గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు.

గృహనిర్మాణానికి సం బంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆయనకు వివరించారు. హౌసింగ్ నియమ నిబంధనల మేరకు, అందుబాటులోఉన్న బోర్డు స్థలాల్లో కొత్తగా గృహనిర్మాణానికి సంబంధించిన స్కీములను అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

పీపీపీ భాగస్వామ్యంలో అఫర్డబుల్ గృహ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూముల పరిరక్షణకు ఓవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే మొద టి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, వీలైనంత త్వరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు వివరించారు.

ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ మే రూ.5 లక్షల సాయం అందిస్తుందని వెల్లడించారు. హైదరబాద్ వేగంగా విశ్వనగరంగా  అభివృద్ధి చెందుతుందని, హైదరబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉండగా, 15 వేల ఎకరాల్లో కొత్తగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు.