11-04-2025 12:19:08 AM
మాది పేదల ప్రభుత్వం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, ఏప్రిల్ 10 ( విజయక్రాంతి ):-ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదల ప్రభు త్వం అని, పేదలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీ నివాస రెడ్డి అన్నారు.గురువారం మంత్రి తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభో త్సవాలు చేసారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇం దిరమ్మ ప్రభుత్వంలో పేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
పాలేరు నియోజకవర్గ ప్రజ ల ఆశీర్వాదంతో తాను నేడు మంత్రిగా ఉన్నానని, తాను కొత్తగూడెం వెళ్తాననే ప్రచా రం అబద్ధమని స్పష్టం చేశారు.తిరుమలాయపాలెం మండలంలో 14 కోట్లతో గ్రామా లలో రోడ్లు మంజూరు చేశామని, గ్రామ పరిధిలో సిసి రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాలలో పెండింగ్ ఉన్న సిసి రోడ్లను పూర్తి చేయడంతో పాటు సుమారు 2 కోట్ల 74 లక్షలతో ఖమ్మం నుంచి వరంగల్ ఆర్ అండ్ బీ రోడ్డు తక్కెలపాడు వయా పిండిప్రోలు రోడ్డు కూడా మంజూరు అయిందని, త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
తి రుమలాయపాలెం, పిండిప్రోలులో చెరో 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలను, వీటికి అనుసంధానంగా ఉన్న షాపులను నేడు ప్రారంభించామని, దీని నిర్మాణానికి కృషి చేసిన అధ్యక్షులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందిస్తు న్నామని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు మంజూరి పత్రాలు
రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా ప్రతి గ్రామంలో వేసవి కాలంలో ఇండ్లు నిర్మించుకునేలా మంజూ రు పత్రాలు అందిస్తామని అన్నారు. మొద టి విడత లోనే రాష్ట్రంలో ప్రభుత్వం 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని, రాబో యే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు కార్పొరేట్ ఆసుపత్రులలో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని అ న్నారు. అర్హత గల వారందరికీ గతం కంటే అధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ రాజకీయాలకు అతీతంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు.
వరద బాధితులను ఆదుకున్నాం
గత సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా తిరుమలాయపాలెం, కూసుమం చి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాలు తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించామని అన్నారు. వరద భీభత్సం తో పూర్తిగా దెబ్బతిన్న రాకాసితండ ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రితో చర్చించి నేడు 52 మంది పేద కుటుంబాలకు ఇంటి స్థలాలు అందిస్తున్నామని, వీరందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని అన్నారు.
ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు.అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 56 మంది లబ్ధిదారులకు 18 లక్షల 68 వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా సహకార అధికారి గంగాధర్, ఆర్ అండ్ బి ఎస్ ఇ యుగంధర్, ఇర్రిగేషన్ ఎస్ ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఏడిఏ సరిత, డివిజనల్ పంచాయ తీ అధికారి రాంబాబు, మండల ఎంపిడివో సిలార్ సాహెబ్, ఇంచార్జ్ తహసీల్దార్ సుధీర్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.