* ఉక్రెయిన్ అధ్యక్షుడు
కీవ్, జనవరి 7: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం వీరో చితంగా పోరాడుతూ పట్టుబిగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఎదురుదాడి చేస్తూ తాము మంచి పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. రష్యాకు చెందిన మిలిటరీ ఆస్తులను ధ్వంసం చేశామన్నారు. శత్రుసైన్యం లో 38వేల మంది చనిపోయారని, వారిలో 15వేల మంది దాకా రష్యా సైనికులు ఉన్నట్లు చెప్పారు.