calender_icon.png 5 October, 2024 | 6:59 AM

కమలకు సాయం చేస్తున్నాం

05-10-2024 12:41:14 AM

న్యూయార్క్, అక్టోబర్ 4: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హో రాహోరీగా సాగుతున్నవేళ డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అనుకోని ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ప్రముఖ న్యూస్ చానల్ ఎంఎస్‌ఎన్‌బీసీ కమ లా హ్యారిస్ అధిక ప్రచారం కల్పిస్తున్నదని ఆ సంస్థ ఉద్యోగే బయట పెట్టారు.

కమలకోసం ఆ చానల్ చేస్తున్న ప్రాపగాండాను మొత్తం తా గిన మైకంలో పూసగుచ్చినట్లు చెప్పేశారు ఆ సంస్థలో ప్రసారమయ్యే అయ్‌మన్ షో రైటర్, ప్రొ డ్యూసర్ బాసిల్ హామ్‌డాన్. స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలన్నీ వెల్లడిం చాడు. ‘ఆమె గెలిచేందుకు సాధ్య మై నంత సాయం చేస్తున్నాం’ అని తెలిపాడు.

తమ చానల్‌లో రోజూ కమ ల మాటలను కోట్ ఆఫ్ ది డే పేరు తో చూపిస్తున్నామని వెల్లడించాడు. బాసిల్ మాటతో కమల ప్రత్యర్థి, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ వర్గం భగ్గుమన్నది. ట్రంప్‌కు బలమైన మ ద్దతుదారుగా మారిన ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. ఆ స్టింగ్ ఆపరేషన్ వీడియోను ఎక్స్‌లో షేర్‌చేస్తూ ‘నిజమే కదా!’ అని క్యాప్షన్ ఇచ్చారు.