అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతోందని పేర్కొన్నారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంద తెలిపారు. 22 ఎంపీ సీట్లు గెలువబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు రాబోతున్నాయని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.