- బీఆర్‌ఎస్సోళ్లు 40 వేల కార్డులే ఇచ్చారు..
- కార్డుల జారీ తర్వాత సన్నబియ్యం పంపిణీ
- పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కరీంనగర్, జనవరి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో 2014లో 90 లక్షల రేషన్ కార్డు ఉంటే గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 40 వేల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని, తమ ప్రభుత్వం 4 లక్షల కొత్త రేషన్‌కార్డులు ఇస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
అందరికి రేషన్‌కార్డులు అందిన తర్వాత ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. బుధవారం బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం రేణికుంట, గంగాధర మండలం నారాయణపూర్‌లో జరిగిన గ్రామసభల్లో ఉత్తమ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత ఉన్నవారందరికీ ఇళ్లు కట్టిస్తామని, అర్హుల జాబితాలో పేరు లేకుం అధికారులకు మళ్లీ దరఖాస్తు సమర్పించాలని సూచించారు.
నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిచేస్తాం
గంగాధర మండలం నారాయణపూర్‌కు వెళ్లిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం గ్రామ మాట్లాడుతూ.. అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రాజెక్టుల జాబితాలో నారా రిజర్వాయర్‌ను చేర్చుతామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవస రూ.70 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు.
ఏడాదిలోగా పూర్తిస్థా ఆయకట్టుకు నీరందిస్తుందని అన్నారు. ఉత్తమ్ వెంట చొప్పదండి ఎమ్మె మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, అడి కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రపుల్ దేశాయ్, ట్రెయినీ కలెక్టర్ అజయ్ యాదవ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ ఉన్నారు.