calender_icon.png 14 October, 2024 | 5:59 AM

ఆ భూమిని వెనక్కి ఇచ్చేస్తున్నాం

14-10-2024 03:43:32 AM

సిద్ధార్థ ట్రస్టుకు కేటాయించిన ఐదెకరాలను తిరిగి అప్పగింత 

ముడా స్కాం వేళ ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ముడా స్కాం ఆరోపణలతో  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  కోర్టు, కేసులతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ తమ ట్రస్టుకు కేటాయించిన ఐదెకరాల భూమిని తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే ఫ్యామి లీ కీలక నిర్ణయం తీసుకుంది.

విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్టియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డు ( కేఐఏడీబీ) 5 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ట్రస్టుకు ఖర్గే, ఆయన అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ తదితరులు ట్రస్టీలుగా ఉన్నా రు. అయితే ఈ స్థలం కేటాయింపులో అవినీతి జరిగిందంటూ ఓ ఆర్టీఐ కార్యకర్త గవర్నర్ గహ్లోత్‌కు ఫిర్యాదు చేశారు. 

సిద్ధార్థ్ ట్రస్టుకు 5 ఎకరాల భూమిని మంజూరు చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రం గా తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.

అయితే కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అన్ని అర్హతలు ఉన్నందునే సిద్దార్థ్ ట్రస్టుకు భూ కేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఖర్గే కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇప్పడు చర్చనీయాంశమైంది.