26-04-2025 11:50:17 PM
మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ (విజయక్రాంతి): పర్యావరణ సవాళ్లను మన దేశం కూడా ఎదుర్కొంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్నా, దాని ప్రభావాలు స్థానికంగా ఉంటున్నాయన్నారు. శనివారం భారత్ సమ్మిట్‌లో ప్యానెల్ డిస్కషన్‌లో ఆక్సలరేటింగ్ క్లుమైట్ జస్టిస్ అంశంపై మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. రైతులు, గిరిజనులు, మహిళలు, పిల్లలు, పట్టణ మురికి వాడల నివాసితులు కర్బన ఉద్గారాలకు బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వనమహోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణలో 273 కోట్లకు పైగా మొక్కలు నాటినట్టు చెప్పారు. అడువుల్లో ఉండే గిరిజనులకు స్థిరమైన వనరుల నిర్వహణలో సహజ హక్కులు, శిక్షణ ఇస్తున్నామన్నారు.