calender_icon.png 2 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు వైద్యం అందుతుందనే భరోసానిస్తున్నాం

23-03-2025 12:26:15 AM

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రోగం వస్తే ఉచితంగా వైద్యం అందుతుందనే భరోసా ప్రజలకు కల్పిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం ఆరో గ్యశాఖ బడ్జెట్ పద్దుపై ఆయన సమాధానమిచ్చారు. ఉస్మానియా హాస్పి టల్ తెలంగాణకు తలమానికమని, గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

గోషామహల్‌లో సు మారు 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా దవాఖాన  నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఉమ్మడి జిల్లాల్లో రీజనల్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని, మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇటీవలే కొత్తగా 213 అంబులెన్స్‌లను ప్రారంభించుకున్నామని.. ఫలితంగా వీటితో ఎమర్జన్సీ రెస్పాన్స్ టైమ్ 14 నిమిషాలకు తగ్గిందన్నారు.