calender_icon.png 14 February, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నాం

14-02-2025 01:44:04 AM

  • గడిచిన ఏడాదిలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం 
  • ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముందుచూపుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది
  • నేటితో మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : ఉమ్మడి జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వెన్నుముక లాంటిది. నాటి నుంచి నేటి వరకు మహబూబ్ నగర్ అంచ లంచేలుగా తన రూపురేఖలను మార్చుకుం టూ ఉమ్మడి జిల్లా చూపు ను తన వైపుకు తిప్పుకుంటుంది.

మహబూబ్ నగర్ కు ఇప్పటికే హైదరాబాద్ నుంచి డబల్ రైల్వే లైన్ తో పాటు అతి తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకునేందుకు మహబూబ్ నగర్ లో నివాసముంటున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. అలాంటి మహబూబ్ నగర్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పట్టణ అభివృద్ధికి చేసిన పనులను ప్రత్యేకంగా విజయక్రాంతి తో పంచుకున్నారు. 

ఎమ్మెల్యే కృషి ఎంతో ఉంది

మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి ఏ గ్రేడ్ ప్రాధాన్యత ఉండేది. ప్రభుత్వం నూతన ఏర్పాటుతోపాటు తాను కూడా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యత లు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో ముందు చూపుతో అడుగులు వేస్తున్నారు. ప్రతి విషయాన్ని పారదర్శకంగా ముందుకు తీసుకుపోతూ మహబూబ్ నగర్ ను ఉన్నత స్థానంలో నిలి పేందుకు సహాయ శక్తులుగా కృషి చేస్తున్నా రు.

ఎమ్మెల్యే సూచన మేరకు ప్రతి విషయం లోనూ పారదర్శకంగా ముందుకు సాగుతు న్నాం. భవిష్యత్తులోనూ మహబూబ్ నగర్ పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. విద్యాపరంగా మరింత సదుపాయాలను కల్పించేందుకు ఎమ్మెల్యే సాయి శక్తులుగా కృషి చేయడంతో సూచనలు పాటిస్తూ అభి వృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాం. 

మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఎదిగింది

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఎమ్మెల్యే సహకారంతో ఏర్పా టు కావడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర సర్వే తో పాటు ప్రతి సర్వేను సమర్థవంతంగా ప్రజల దృష్టికి తీసుకుపో తూ విజయవంతంగా పూర్తి చేశాం. మున్సి పాలిటీ పరిధిలోని అద్దె భవనాల అద్దెను వసూలు చేయడంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పక్కాగా ముందుకు సాగు తున్నాం.

గత ఏడాది మున్సిపాలిటీ అద్దెల ను గతంలో కంటే అత్యధికంగా వసూలు చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకుగాను పలు షాపులను సీజ్ చేసి అదే డబ్బులు వసూలు చేస్తున్నాం. పట్టణ అభివృద్ధికి అద్దె భవనాల లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉంది. కనీసం 20% పెండింగ్ డబ్బులు చెల్లించాలని కోరుతున్నాం.

దాదాపు రూ 23 కోట్ల పైచిలుకు అద్దె డబ్బులు వసూలు కావాల్సి ఉంది. దీంతోపాటు పట్టణ వాసులకు ముందస్తుగా వేసవిలో ఎలాంటి నీటి ఇబ్బంది రాకుండా ఎమ్మెల్యే సూచన మేరకు అవసరమైన ప్రాంతాలలో తాగునీటి బోర్లను కూడా వేయడం జరుగుతుంది. పట్టణవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాను.