08-04-2025 01:03:22 AM
- ప్రాధాన్యతను బట్టి అభివృద్ధి పనులకు శ్రీకారం
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 7 (విజయ క్రాంతి) : ప్రతి ఒక్కరికి నచ్చేలా అభివృద్ధి పనులను విడుదలవారీగా శ్రీకారం చుట్టుకుంటూ పూర్తి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రూ 50 లక్షల ముడా నిధులతో హైమాస్ట్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన, కోటి యాభై లక్షలతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
మహబూబ్ నగర్ రూరల్ మండలం పరిధిలోని 511 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ, మన్నెంకొండ గేటు దగ్గర వరి కొనుగోలు కేంద్రాన్ని,144 అంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి ఎక్కడ ఆగదని ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఎవరో ఏదో గాలి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మవలసిన అవసరం లేదని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచి చెబుతామని పేర్కొన్నారు.
రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటు లో ఉండేలా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. ఎక్కడ ఇలాంటి ఆపద ఉన్న తక్షణమే స్పందించి ప్రతి విషయంలోనూ అందరికీ మంచి జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహార్, అవేజ్ , అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శాంతయ్య యాదవ్, ఖాజా పాషా, మునీర్, మోసిన్, ఉమర్ ఫరూఖ్, అంజద్, నాయకులు రామచంద్రయ్య , గులాం జహీర్, పీర్ మహ్మద్ సాదిక్, అజీజ్ అహ్మద్ , చర్ల శ్రీనివాసులు,, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.