కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
సిద్దిపేట, జూలై19 (విజయక్రాంతి): హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని.. ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నామని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేటలో ఓశుభకార్యానికి హాజరైన వీహెచ్ విలేకరులతో మాట్లాడారు. రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎ స్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రారం భించిన వారే ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, నాయకులు అంజిరెడ్డి, మల్లారెడ్డి, గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.