calender_icon.png 16 January, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం

11-07-2024 02:26:48 AM

  1. ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకం, 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్‌ల ఏర్పాటు
  2. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని.. తమ సర్కార్ ఆ ల్యాబ్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుక తిరిగే చట్నీలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

గత పాలనలో రాష్ట్రంలో నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను ప్రక్షాళన చేసి సమూల మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. కొత్తగా రాష్ట్రంలో 17మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించి రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా రోజుకు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. కొత్తగా 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రీట్ వెండర్లు సైతం ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లను సైతం ఇకపై నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు. ఆహార కల్తీకి పాల్పడే సంస్థల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.