14-04-2025 12:56:22 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
సుల్తానాబాద్,ఏప్రిల్13(విజయక్రాంతి); నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు సీజన్లు గింజ కటింగ్ లేకుండా రైతుల వరి ధాన్యం కొనడం జరిగిందని ఈ నాలుగో పసలుకు కూడా గింజ కటింగ్ ఉండదని పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .అన్నారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి కాలనీ, అంకంపల్లి, మడిపల్లి, ఆశన్నపల్లి, పెగడపల్లి, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల్లో సింగల్ విండో, వ్యవసాయ మార్కెట్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో, రైతులతో కలసి ప్రారంభించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వములో 10 సంవత్సరాలు రైతుల వరి ధాన్యము నుంచి క్వింటాలుకు 10 నుంచి 15 కిలోల వరకు కోతబెట్టి రైతన్నలను ఇబ్బందికి గురి చేశారని అన్నారు.
ఈ నియోజకవర్గంలో ఈ వేసంగిలో కూడా మన ప్రజా ప్రభుత్వం సహకారంతో ప్రతి పంటకు సాగునీరు అందించానని అన్నారు. సన్న వడ్లకు గత వాన కాలంలో మన నియోజకవర్గంలో 59 కోట్ల 62 లక్షలు రైతులకు బోనస్ ఇవ్వడం జరిగింది అన్నారు. ఈసారి కూడా సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు పలువురు డైరెక్టర్లు మరియు రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.