calender_icon.png 26 January, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నాం

25-01-2025 12:00:00 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, జనవరి 24: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం  చేవెళ్ల మండలం పల్గుట్ట గ్రామంలో రూ. 10 లక్షలు, ముడిమ్యాల గ్రామంలో రూ. 15 లక్షలు, కుమ్మెర గ్రామంలో 10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో రూ.14.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లను నిర్మిస్తున్నామని, ఇంకా ఎక్కడైన మిగిలిపోయిన పనులు ఉంటే త్వరలోనే పూర్తిచేస్తామని మాటిచ్చారు.  అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, ప్రజా పాలన కార్యక్రమంలో ప్రకటించిన లిస్టులో పేర్లు లేకుంటే మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని సూచించారు.

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసాతో పాటు అన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో గ్రంథా లయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, శంకర్‌పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయ లక్ష్మి ప్రవీణ్, డీసీసీ మాజీ ప్రెసిడెంట్ పడాల వెంకట స్వామి,

డీసీసీ ఉపాధ్యక్షుడు పడాల రాములు,  మండలాధ్యక్షుడు వీరేందర్ రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, సీనియర్ నేతలు మర్పల్లి కృష్ణారెడ్డి పడాల ప్రభాకర్, జనార్దన్, గోనె జంగారెడ్డి, సాయినాథ్, వాజిద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎర్ర మల్లేష్, డైరెక్టర్లు నరేందర్, శివరాజు, నవీన్ రెడ్డి, ఎంపీడీవో హిమబింధు, ఎంఈవో పురందేశ్వర్, సెక్రటరీ షమీమ్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.